
మోత్కూరు పట్టణంలోని మధుర మీనాక్షి పంక్షన్ హాల్లో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ మోత్కూరు మున్సిపాలిటీ, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల బూత్ ఇన్చార్జిల సన్నాక సమావేశంలో పాల్గొన్న
తుంగతుర్తి శాసనసభ్యులు
డా.గాదరి కిశోర్ కుమార్, జిల్లా BRS పార్టీ అధ్యక్షులు & రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
రాబోయే అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మరియు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్క ఓటరుకు తెలియజేసి ముఖ్యంగా గ్రామ గ్రామాల్లో BRS పార్టీ నాయకులు , కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి , ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, ముఖ్యంగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి గురించి ఓటర్ల తో చర్చించి మళ్ళీ తుంగతుర్తి గడ్డ పై అత్యధిక మెజారిటీ తో గులాబీ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రి కి కానుకగా ఇవ్వాలన్నారు. ఈనెల 29 న తిరుమలగిరి పట్టణంలో సీఎం కేసీఆర్ తుంగతుర్తి సమర శంఖారావం సభకు మోత్కూరు, మోత్కూరు మున్సిపాలిటీ మరియు అడ్డగూడూరు మండలాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు BRS పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు BRS పార్టీ లోకి చేరారు…
ఈకార్యక్రమంలో అడ్డగుడూర్ జడ్పీటీసి శ్రీరాముల జ్యోతి అయోధ్య,ఎంపీపీ దర్శనాల అంజయ్య,మండల BRS పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, PACS చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు,మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపెళ్లి మహేంద్ర నాథ్,మండల ప్రధాన కార్యదర్శి సత్యం గౌడ్,అడ్డగుడూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగులపల్లి దేవగిరి,మాజీ ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి,గ్రంధాల చైర్మన్ పాశం విష్ణు,ఎంపీటీసీ కోఆప్టెడ్ మెంబెర్ అంథోని,యువజన అధ్యక్షుడు అశోక్ గౌడ్,ఉపాధ్యక్షుడు బాలెంల విద్యా సాగర్,యువజన నాయకులు పాక సింహాద్రి యాదవ్ మండల BRS యువ నాయకులు బాలెంల నరేందర్ BRS నాయకులు బాలెంల అయోధ్య బాలెంల సురేష్ పోలేపాక అబ్బులు తల్లపెళ్లి కృష్ణ బాలెంల మధు పోలేపాక సందీప్ అజింపేట ఎలెందర్ యాదవ్ ఆంజనేయులు కుమార్ రాపక చిప్పలపెళ్లి నరేందర్ సురారం రాజు రామరం మందుల కిరణ్ నరేందర్ గౌడ్ మహేష్ మహేందర్ కంచనపల్లి చెడే సలీమ్ రమేష్ స్వామి సందీప్ చందు తదితరులు పాల్గొన్నారు..