
మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం నాడు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్… సోమవారం నాడు మహబూబ్ నగర్ లో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గత 10 ఏళ్లలో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్… ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని… అందుకు తామంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా శేఖర్ పేర్కొన్నారు. అభివృద్ధికి చిరునామా ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి ఘన విజయం సాధించేందుకు, అభివృద్ధికి పట్టం కట్టేందుకు ప్రజలంతా తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.