Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

ప్రముఖ కవి రచయిత పెద్దిరెడ్డి గణేష్ రచించిన అశ్రుస్వరం కవితా పుస్తకమును ఆవిష్కరించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

అపురూప క్షణాల ఆస్వాదన శాశ్వతం చేసేదే సాహిత్యం

రాసేవాళ్లు తగ్గుతున్నారు రాసింది చదివే వాళ్ళు వినేవాళ్లు ఇంకా తగ్గుతున్నారు

అయినా సాహిత్యానికి మరణం లేదు

అమ్మ భాష మరిస్తే అన్నీ మరిచినట్టే తనను తాను మర్చిపోయినట్టే

సూర్యాపేటకు ఆడియన్స్ కల్చర్ ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవారు

సూర్యాపేట అభివృద్ధి పై కవి రచయిత పెద్దిరెడ్డి గణేష్ తో ఎడతెగని చర్చలు చేసేవాళ్లం

ప్రముఖ కవి రచయిత పెద్దిరెడ్డి గణేష్ రచించిన అశ్రుస్వరం కవితా పుస్తకమును ఆవిష్కరించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

నాటక సినీ రచయిత, ప్రయోక్త, నటుడు, దర్శకుడు, శివతత్వ గాయకుడు తనికెళ్ల భరణి కి పుస్తకం అంకితం ఇచ్చిన రచయిత పెద్దిరెడ్డి గణేష్

ఉరుకులు పరుగుల నేటి మానవుని నిత్యజీవితంలో కష్టాలు ఇబ్బందులు చికాకులు వచ్చినప్పుడు కొద్దిసేపు సేద తీరటానికి సాహిత్యం ఉపకరిస్తుందని, అలాంటి అపురూప క్షణాల ఆస్వాదనను శాశ్వతం చేసేదే అసలు సిసలైన సాహిత్యమని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటకు చెందిన ప్రముఖ కవి, రచయిత, బ్రాండ్ అంబాసిడర్,సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ రచించిన “అశ్రుస్వరం” కవిత పుస్తకాన్ని శుక్రవారం రాత్రి స్థానిక బాలాజీ కన్వెన్షన్ హాలులో మంత్రి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ నాటక సినీ రచయిత, ప్రయోక్త, నటుడు, దర్శకుడు, కవి, శివతత్వ గాయకుడు తనికెళ్ల భరణి కి రచయిత పెద్దిరెడ్డి గణేష్ అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాను రాను పుస్తకాలు, కవిత్వం, సాహిత్యం రాసే వాళ్ళు తగ్గిపోతున్నారని, వినే వాళ్ళు చదివే వాళ్ళు కూడా బాగా తగ్గిపోతున్నప్పటికీ సాహిత్యానికి మరణం లేదన్నారు. సూర్యాపేటకు ఆడియన్స్ కల్చర్ బాగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవారని గుర్తు చేశారు. సూర్యాపేటకు
“భానుపురి భారతి” ఆడిటోరియంను 25 కోట్ల రూపాయలతో నిర్మించి సాహితీ పిపాసి పెద్దిరెడ్డి గణేష్ ను నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ బిజీగా ఉంచాలని ఆలోచన ఎప్పటి నుంచో ఉందన్నారు. తెలుగు భాష అంటే చూడకూడనిది, వినకూడనిది అనే భావ దారిద్రంలో కొంతమంది ఉండటం బాధాకరమని, అమ్మ భాష మరిస్తే అన్నీ మరిచినట్టేనని, తనను తాను కూడా ప్రతి మనిషి మర్చిపోయినట్టేనని మంత్రి వ్యాఖ్యానించారు. సాహిత్యం అంటేనే మనల్ని మనం గుర్తుంచుకునే విధంగా సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్నామని, ముందు తరాలకు కూడా ఈ సాహితీ పరిమళాలు అందేలా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాను రాను వినే కల్చర్ కూడా తగ్గిపోతుందని, మొదటగా వింటేనే కదా చైతన్యం వచ్చేదని, ఆస్తులు, అంతస్తులు, డబ్బు సంపాదన ఇవేమీ మన వెంట రావని, జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని రాసే సాహిత్యం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని సూచించారు. సూర్యాపేట నిర్మాణంలో స్వర్గీయ మీలా సత్యనారాయణ పాత్ర చాలా ఉందని, ఆయన నెలకొల్పిన పరిశ్రమ నేడు వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తుందని, కళలు సాహిత్యం పట్ల మక్కువ ఉన్న వివి రామయ్య కూడా బాల భవన్ నిర్మాణం కోసం అడిగే వాళ్ళని చెప్పారు. ప్రతి మనిషి ఎదగాలని, వెలుగులను ఇతరులకు పంచాలని కోరారు. సూర్యాపేటను ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేయాలనే విషయంపై రచయిత పెద్దిరెడ్డి గణేష్ తో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి చర్చించే వారమని గుర్తు చేశారు. పుస్తకంలోనీ ఊరు కవిత సూర్యాపేటకు సంబంధించినది అని కవి దర్శకుడు తనికెళ్ల భరణితో వ్యాఖ్యానించారు. పుట్టినా, సచ్చినా సూర్యాపేటలోనే అనే విధంగా పలువురు పేర్కొంటున్నారని, సూర్యాపేటలో స్మశానాన్ని కూడా ఒక మిగిలిపోయే జ్ఞాపకంగా నిర్మించామని చెప్పారు. ప్రముఖ కవి, రచయిత, నటుడు దర్శకుడు పుస్తక సంకలనాన్ని అంకితం తీసుకున్న తనికెళ్ల భరణి మాట్లాడుతూ సూర్యాపేట వాసులు సాహితీ రసజ్ఞులని, రచయిత పెద్దిరెడ్డి గణేష్ పై వీక్షకుల కరతాళ ధ్వనుల మధ్య అప్పటికప్పుడు అల్లిన కవితను చదివి వినిపించారు. తాను ప్రతి సంవత్సరం ముగ్గురు కవులకు కనకాభిషేకం చేసే వాడినని, కవికి కలం పొలం తప్ప ఏముంటుందనే సందర్భంలో శ్రీనాథుడు రచించిన పద్యాన్ని రాగయుక్తంగా చదివి వీక్షకులను ఆనంద డోలలాడించాడు. ఇంకా ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి ఎండి, సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, సూర్యాపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనరసయ్య, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుల గోపిరెడ్డి, వై వెంకటేశ్వర్లు ఉప్పల ఆనంద్,అప్పం శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కవులు రచయితలు ప్రసాదమూర్తి, డాక్టర్ సాగర్ల సత్తయ్య, డాక్టర్ రామదాస్, మనమ్ వికాస వేదిక సభ్యులు డీఎస్పీ శర్మ, బంగారు బ్రహ్మం కోదాటి నరసింహారావు, గెల్లి అంజన్ ప్రసాద్, చిట్టెపు వీరయ్య, తోట శ్యామ్ కవులు జి వెంకటేశ్వర్లు, శీల అవిలేను, బొలిశెట్టి మధు, డాక్టర్ బంటు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కవి మిత్రులందరికీ శాలువాలతో సన్మానించి అశ్రుస్వరం పుస్తకాలను అందించారు. నటుడు తనికెళ్ల భరణితో ఫోటోలు దిగడానికి ఆహుతులు పోటీపడ్డారు. డాక్టర్ సాగర్ల సత్తయ్య పుస్తకాన్ని సమీక్షించగా కవులు ప్రసాదమూర్తి జీ వెంకటేశ్వర్లు పుస్తకం గురించి పరిచయం చేశారు. పుస్తక రచయిత పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజు నాడు ఇంత పెద్ద ఎత్తున సాహితి అభిమానుల మధ్యన పుస్తకాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింప చేసుకొని తనికెళ్ల భరణి అంకితంఇవ్వడం జీవితంలో మరువలేని మరపురాని సంఘటనగా ఒక తీపి జ్ఞాపకం గా ఉంటుందని వీక్షకుల చప్పట్ల మధ్యన సంతోషంతో ప్రకటించారు. వ్యాఖ్యాతలుగా గుండా రమేష్ చకిలం సంధ్యారాణి వ్యవహరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!