Thursday, April 17, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు మెట్రో రైల్ శుభవార్త చెప్పింది. రేపు అంటే 28 గురువారం రోజు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

మెట్రో రైల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు నడుపుతాయి. రాత్రి రెండు గంటలకు రైళ్లు చివరి స్టేషన్‌కు చేరుకుంటాయి.

ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్‌లలో అదనపు పోలీసులు, ప్రయివేట్ సెక్యూరిటీని మోహరించనున్నట్లు తెలిపారు. డిమాండ్‌ను బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, అదనంగా రైళ్లు నడపనున్నట్లు వివరించారు. మళ్లీ 29న ఉదయం 6 గంటలకు యథాతథంగా మెట్రో కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!