
సమావేశానికి భారీగా హాజరైన ముఖ్య నాయకులు, కార్యకర్తలు.
పిల్లి రామరాజు యాదవ్ కామెంట్స్ :-
నల్లగొండ నియోజకవర్గంలో నాయకత్వ మార్పు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు..
ఇప్పుడు ఉన్న ఇద్దరి నాయకులకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలి.
2018 ఎన్నికలో ఓడిపోయాక మీ చావు మీరు చావండి అని ఇక్కడి నుండి వెళ్లిపోయి, మళ్ళీ ఎన్నికలు వచ్చాయని తిరుగుతున్నాడు..
ఒక్క అవకాశం ఇవ్వండి నల్గొండ నియోజకవర్గం ముఖ చిత్రం మారుస్తా.
విలువలతో కూడిన రాజకీయం చేస్తా.
పెద్ద పెద్ద రాజకీయ మేధావుల నుండి మద్దతు లభిస్తుంది.
నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.
అభివృద్ధి ఫలాలు అందరికి పంచుతా.
ఒకసారి బహుజనులకు అధికారం కావాలని నల్గొండ ప్రజలు కోరుకుంటున్నారు.
ఖచ్చితంగా నల్లగొండ ఎన్నికల బరిలో వుంటా, కార్యకర్తలు ఆదైర్యాపడవద్దు.
రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకొని పోటీ చేసే గుర్తును తెలియజేస్తా, గుర్తును ప్రజలలో తీసుకపోయే భాధ్యత మీది.
మీ ఆశీర్వాదం కోసం మీ గడప గడపకు వస్తా.
ఎవరి బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడేది లేదు.
ఇప్పటివరకు ఓటమి అంటే ఏంటో తెలియదు, కచ్చితంగా మనమే గెలుస్తాం.