మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బెలిదే రమేష్ గుప్తా భారీ మెజార్టీతో గెలుపొందారు.తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యాలయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం జగదీర్ గుట్ట లో ఎన్నికలు నిర్వహించారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు,జిల్లా కౌన్సిల్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.జిల్లా మహాసభలో ఉన్న 239 ఓట్లకు గాను 218 సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. అధ్యక్ష బరిలో బెలిదే రమేష్ గుప్తా,రేబిల్లి శ్రీనివాస్ గుప్తా లు పోటీలో నిలిచారు.రేబల్లి శ్రీనివాస గుప్తా పై 110 ఓట్ల భారీ మెజార్టీతో కీసర గ్రామ నివాసి బెలిదే రమేష్ గుప్తా ఘనవిజయం సాధించారు. బిల్డి రమేష్ గుప్తకు 164 ఓట్లు,రేబల్లి శ్రీనివాస్ కు 54 ఓట్లు వచ్చాయి.తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలోని ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు.