Monday, April 21, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

మేదరి ఆత్మగౌరవ భవనం నిర్మించి ఇస్తా: నరేందర్

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 33వ డివిజన్ రాజశ్రీ గార్డెన్లో ఏర్పాటు చేసిన మేదరి(మహేంద్ర) కుల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…
ఈ సందర్భంగా మేదరి కులస్తులు ఎమ్మెల్యే నరేందర్ కు పూర్తి మద్దతు తెలిపి రాబోవు ఎన్నికల్లో అఖండ మెజారిటీతో నరేందర్ గెలుపులో భాగస్వామ్యం అవుతామని మూకుమ్మడిగా వాగ్దానం చేశారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ…

మేదరి సంఘ ఆత్మగౌరవ భవనానికి కోటి రూపాయల విలువైన 300వందల గజాలు స్థలం కేటాయించి,9 లక్షలు నిధులు అందించడం జరిగింది నేడు మాట ఇస్తున్న మేదరి ఆత్మగౌరవ భవనం నిర్మించి ఇస్తా
మేదరి కులస్తులకు మొన్న బిసి బంధు అందించడం జరిగింది అర్హులైన వారికి డబల్ బెడ్రూమ్,గృహలక్ష్మీ,బిసి బంధు అందిస్తాం
ముడుసారి ముఖ్యమంత్రి
ఇక్కడ కాంగ్రెస్ నుండి పోటీ చేసే వ్యక్తి వరంగల్ తూర్పులో పోటీ చేసి తప్పు చేసామంటూ పరకాలలో మాట్లాడుతున్నారు పరకాల అవ్వగారిల్లు,మన తూర్పు అత్తగారిల్లు అంట
అలాంటి వాళ్ళు మునుముందు రకరకాల బ్యాండేజ్ లు,కట్లు కట్టుకొని ఊసరవేల్లిలా రంగులు మారుస్తారు
ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన బిడ్డను నేను చనిపోయే వరకు ఇక్కడే ఉంటా కానీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నుండి పోటీ చేసే వాళ్ళు ఒకరు వర్ధన్నపేట మరొకరు వంచనగిరి
మంచికైనా చెడుకైనా మనోడే కావాలి ఆపతి వస్తే నా ఇల్లు ప్రజలకు అత్యంత అందుబాటులో ఉంది ఎప్పుడన్నా రావచ్చు మీకు అండగా ఉంటా
కేసీఆర్ గారి మేనిఫెస్టోలో 18 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలు వయసున్న ఉన్న మహిళలకు సౌభాగ్య లక్ష్మి ద్వారా మూడు వేల రూపాయల భృతి అందిస్తాం గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకు,వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా 15 లక్షల వరకు వెసులుబాటు,పింఛన్ 2000నుండి 5000వేలకు,వికలాంగుల పెన్షన్ 4000 నుండి 6000 పెంచడం జరిగింది, ప్రతి ఇంటికి సన్న బియ్యం,కేసీఆర్ బీమా ద్వారా ఐదు లక్షల బీమా ఇలా సబ్బండ వర్గాలు ఆదుకునే విధంగా కేసీఆర్ మేనిఫెస్టో రూపొందించారు కేసీఆర్ సంక్షేమ పథకాలు ద్వారా కల్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ కిట్ రైతు బంధు,రైతు బీమా ఇలా అందరిని అందుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నాకు ఐదేళ్లు అవకాశం ఇస్తే అందులో రెండు సంవత్సరాలు కరోనాల పోయింది మిగిలిన మూడు సంవత్సరాలలో 4100 కోట్లు తీసుకువచ్చి నూతన కలెక్టరేట్ జిల్లా కేంద్రం 24 అంతస్తుల హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రధాన రహదారులైన మండి బజార్ చౌరస్తా డివిజన్లోని అంతర్గత సిసి రోడ్లు అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్స్ ఇలా ఎంతో అభివృద్ధి చేశాను
ఎన్నికలవేళ వచ్చే కొందరు నాయకులను ఇన్నేళ్లు ఎక్కడ పోయారని ప్రజలు సూటిగా ప్రశ్నించాలి
అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలది కీలకపాత్ర అన్ని వర్గాలను గొప్పగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మరోమారు దీవించి హ్యాట్రిక్ సాధించే విధంగా కృషి చేయాలని వరంగల్ తూర్పు నియోజకవర్గం గులాబీ జెండా ఎగరేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుక అందిద్దాం
కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించండి ఈ ఒక్క నెల నాకోసం పనిచేయండి మిగిలిన 59 నెలలు నేను మీకు సేవ చేస్తా
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తో పాటు మేదరి సంఘ రాష్ట్ర నాయకులు వరంగల్ తూర్పు మేదరి సంఘ పెద్దలు మహిళలు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!