
భూత్పూర్ మండలం కరివేన గ్రామంలో మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాచాల యుగంధర్ గౌడ్ తదితర మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలసి గ్రామంలో విస్తృతంగా పర్యటించి, ఎన్నికల ప్రచారం నిర్వహించి, హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరిన దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR), ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు గులాంగారి ఆంజనేయులు, నెమలికుంట అమరేందర్ రెడ్డి, బి. అశోక్ రెడ్డి, ఎ. దామోదర్ రెడ్డి, బి. చెన్ రెడ్డి, బి. కృష్ణయ్య తో పాటు 141 మంది బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి జిఎంఆర్ తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.