
కుత్బుల్లాపూర్ లోని ఎన్నో పరిశ్రమల్లో వేతన ఒప్పందాలు కుదిర్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాం…
130 -సుభాష్ నగర్ డివిజన్ ఓం జెండా వద్ద నిర్వహించిన తెలంగాణ భావన మరియు ఇతర నిర్మాణ రంగాల ఖమీకులా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మాల్యాద్రి, ఉపాధ్యక్షులు రాము, ప్రధాన కార్యదర్శి రాఘవ ల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికే ఎన్నో సంస్కరణలను చేస్తూ వారి అభ్యున్నతి కోసం పాటుపడిన ఏకైక ప్రభుత్వం బి.ఆర్.ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద అన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ్మలోని ఎన్నో పరిశ్రమల్లో మా ప్రభుత్వ హయాంలో పరిశ్రమల యాజమాన్యంతో చర్చించి కనీస వేతనాలతో పటు మరిన్ని డిమాండ్లను అమలు పరిచామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జి.సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఓపెరటివే చైర్మన్ మన్నే రాజు, బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులూ ఎం.ఎస్.వాసు, పండరి, డాక్టర్ హుస్సేన్, యాదగిరి, యూసఫ్, భవన నిర్మాణ సంఘం సభ్యులు సి.హెచ్ సురేష్, కొండయ్య, మల్లికార్జున,డి.అంకయ్య, కోటయ్య, కోటేష్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.