మాజీ మంత్రి, బిఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఅర్ జన్మదిన వేడుకలను బుదవారం కుషాయిగూడలో ఘనంగా నిర్వహించారు. బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వండాల శివకుమార్ గౌడ్, నేమురి మహేష్ గౌడ్ల అధ్వర్యంలో కెటిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలసి చర్లపల్లి డివిజన్ పరిదిలోని కుషాయిగూడలో మొక్కలు నాటి ఈసిఐఎల్ సాయిబాబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కుషాయిగూడ బస్ స్టాప్ లో పార్టీ నాయకులతో కలసి భారీ కేకు కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి . కనుకరాజ్ గౌడ్ , నారెడ్డి రాజేశ్వర్ రెడ్డి , సార అనిల్ కుమార్, జయక్రిష్ణ, కర్చర్ల రాజు, చక్రపాణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు