కాప్రా కమలానగర్ అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన లలితా సహాస్ర పారాయణం, అమ్మవారి కుంకుమార్ఛన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది మంది మహిళా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారి పారాయణం, కుంకుమార్ఛనలో పాలొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రతియేట అమ్మవారి పారాయణం, కుంకుమార్ఛన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయకమిటీ పేర్కొంది. అమ్మవారి పారాయణంలో ఆలయ ప్రాంగణం అత్యాథ్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా అయ్యప్ప భక్త బృందం చర్లపల్లి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూమారు రెండు వేలకు పైగా భక్తులు హాజరై తీర్ధ ప్రసాదాలు స్వీకరించినట్లు ఆలయ ప్రధాన అర్ఛకులు మనోజ్ నంబూద్రీ, హరినంబూద్రీ, గురుకేశవ్ భట్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పైళ్ల మధుసూదన్ రెడ్డిగురుస్వామి, కొటవెంకట్ రెడ్డి, కట్టంగుర్ షరిష్ రెడ్డి, బీబీనాయుడు, హరికిష్ణారెడ్డి, శరత్ బాబులు, సైదాచారీలు పాల్గొన్నారు