హైదరాబాద్ నగరంలో సుమారు 55 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మూసీ నదిపై నార్సింగి నుంచి గౌరెల్లి వరకు ఐదు కొత్త వంతెనలను నిర్మిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మూసీ నదిపై ఒక్కొక్కటి నాలుగు లేన్‌లతో 5 వంతెనలను నిర్మించాలని యోచిస్తోంది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తో కలిసి HMDA లేఅవుట్ ఉప్పల్ భగాయత్ వద్ద వంతెన (మూసీ నదిపై) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి
ఈ కార్యక్రమంలో GHMC మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు ,డివిజన్ ప్రెసిడెంట్స్, పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.