
దేవరకద్ర MLA అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కొండ ప్రశాంత్ రెడ్డి
దేవరకద్ర కాంగ్రెస్ టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలి TPCC రాష్ట్ర కార్యదర్శి కొండ ప్రశాంత్ రెడ్డి(KPR)
టికెట్ల కేటాయింపులో కష్టపడిన వారికి ప్రాధాన్యత లేదని ఆవేదన…
రెబల్ అభ్యర్థిగా బరిలో ఉండాలని కోరిన అభిమానులు…
అధిష్టాన స్పందన తర్వాత నిర్ణయం తీసుకుందామని సర్ది చెప్పిన కొండ ప్రశాంత్ రెడ్డి…
దేవరకద్ర నియోజకవర్గ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అనుచరులతో దేవరకద్రలోని తన నివాసంలో సమావేశమైన రాష్ట్ర కార్యదర్శి కొండ ప్రశాంత్ రెడ్డి గారు…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డామని, కాంగ్రెస్ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని కల్పిస్తూ నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని అన్నారు.
పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న సమయంలో అధికార పార్టీ పెట్టిన అక్రమ కేసులతో జైలు జీవితం సైతం అనుభవించిన వ్యక్తినని అన్నారు.
కష్టకాలంలో సైతం సొంత ఆస్తులు అమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్, దళిత దండోరా యాత్ర ,నిప్పులాంటి నిరుద్యోగి, చేవెళ్ల ప్రజా గర్జన, దళిత గిరిజన రావిరాల సభ, భారత్ జూడో యాత్ర, వరంగల్ డిక్లరేషన్, తుక్కుగూడ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ ప్రతి కార్యకర్తకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరిగిందన్నారు.
క్రమశిక్షణ, నిజాయితీ నిబద్ధత ఉన్న నాయకులను అధిష్టానం గుర్తించాలని అప్పుడే పార్టీ మనుగడ సాధ్యమని అన్నారు
అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు తన అనుచరులు ఎవరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని అధిష్టానం స్పందన తర్వాత మీ కోరిక మేరకు భవిష్యత్ కార్యాచరణ చేపడతామని సూచించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.