
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్…
రాహుల్ గాంధీ రాసిచ్చిన స్క్రిప్ట్ చూసి చదువుతాడు చివరకు అబాసుపాలు అవుతాడు
రాహుల్ గాంధీ ఏ యాత్ర చేసిన మధ్యలోనే వదిలేస్తాడు అది ఆయన మనస్తత్వం
కేసిఆర్ ది కుటుంబ పాలన అన్నారు. కానీ మీరు తాత ముత్తాతల నుంచి చేస్తుంది ఏమిటి?
కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రం కోసం జైలుకు వెళ్లిన కుటుంబం వారిది.
BRS, BJP ఎన్నటికీ ఒక్కటి కాదు. కాంగ్రెస్, బిజెపి కలిసి గుజరాత్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారు.
ఆ రెండు పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలను ఎదిగనివ్వడంలేదు.
రాహుల్ గాంధీ కుటుంబం అనేక కుంభకోణాల్లో ఇరుక్కుని మోడీ దయ వల్ల కేసుల నుంచి బయటపడ్డారు
ఓ మాజీ ప్రధాని కుమారుడు కాకుంటే రాహుల్ గాంధీకి ఉన్న అర్హత ఎంది?
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను బొమ్మను చేస్తున్నారు. ఆయన పేరుకే అధ్యక్షుడు పార్టీ అంత వారి కనుసన్నల్లోనే ఉంటుంది. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు చేసిందేమిటో అందరికీ తెలుసు.
మీ పాలనలో 60 శాతం ఉన్న బిసిలకు ఎందుకు బీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు?
బీసీ మంత్రినైన తనకు ఒక్కడికే 7 శాఖలను కేటాయించి బీసీలపై ప్రేమ చూపిన ఘనత సీఎం కేసీఆర్ ది.
మీ హయాంలో ఒక్క బీసీ మంత్రికైనా ఇన్ని శాఖలు కేటాయించారా? మీ పార్టీ నుంచి ఎంత మంది బీసీలు సీఎం అయ్యారు
ఓట్లేసే యంత్రాలుగా బీసీలను వాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 1000 గురుకులాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అడిగిందే బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం చేసి పంపింది తమ ప్రభుత్వం.
సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ కుమ్ములాటలు, టికెట్ల లొల్లి వారి చరిత్ర
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చే లక్ష కోట్లు కానప్పుడు లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది… ఇంత తెలివిలేని ఆరోపణ ప్రపంచంలో ఎవరైనా చేస్తారా?
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు నెల రోజులు కూడా అమలు కాలేదు.
కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు 40 శాతం కమీషన్లు తీసుకుంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 50 శాతం కమిషన్ గా గుర్తింపు పొందింది
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో లక్షల ఇందిరమ్మ ఇండ్ల పేరిట మింగేశారు. కరెంట్ ఇవ్వలేక దివాళా తీయించారు. కనీసం తాగు, సాగు నీరు కూడా ఇవ్వలేదు.
ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో బాగుపడుతున్న తెలంగాణను చూసి ఓర్వలేకే దుష్ర్పచారం.
రాహుల్ గాంధీ ప్రచారం ప్రారంభించిన రామప్ప టెంపుల్ కు యునెస్కో గుర్తింపు తెచ్చింది మా ప్రభుత్వం. వారి పాలనలో ఎందుకు ఇది సాధ్యం కాలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కనీసం పట్టించుకోలేదు
శ్యాండ్, మైనింగ్, వైన్, మాఫియా అంటేనే కాంగ్రెస్ పార్టీ.
3 గంటల కరెంట్ చాలని మీ పిసిసి అధ్యక్షుడే అహంకారంతో అహంకారంతో మాట్లాడుతున్నారు.
పొరపాటున వాళ్లు అధికారంలోకి వస్తే కరెంటు ఉండదు. రైతుల పరిస్థితి ఆగం అవుతుంది.
బీసీల గురించి ఇంత ప్రేమ వలకబోస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడే 45 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాలను చచ్చే వయసులో పార్టీ మారుతున్నాడని ఇంత నీచంగా మాట్లాడాడు
రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారి ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడో మర్చిపోయాడా?
మా నాయకుడి లాగా ఒకేసారి ఎమ్మేల్యే ధైర్యంగా టికెట్లు ఇవ్వండి తెలుస్తుంది మీ సత్తా. అలా చేస్తే గాంధీ భవన్ దద్దరిల్లిపోతుంది. ఎమ్మేల్యే టికెట్లను అమ్ముకుని అన్ని వర్గాలకు మోసం చేస్తున్నారు
సంపదను పెంచాలి… పంచాలనేది కెసిఆర్ సిద్దాంతం. కాంగ్రెస్ ది మాత్రం సంపదను దోచే విధానం
దేశంలోనే అత్యుత్తమ మేనిఫెస్టో మాది. సీఎం కేసీఆర్ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తాడు.
రాహుల్ గాంధీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే అబాసుపాలు అవుతారు రాహుల్.
మత కలహాల పేరిట మీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘర్షణలు లెక్కలేనన్ని. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తమ 10 ఏళ్ల పాలనలో ఒక్కసారైనా ఘర్షణలు జరిగాయా?
దేశ్యాప్తంగా బీ ఆర్ ఎస్ పార్టీ బలంగా మారుతుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నది
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దొంగ సర్వేలను ప్రజలు అస్సలు నమ్మరు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం.