తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, ఏ.ఎస్.రావు నగర్ డివిజన్, నార్త్ కమలానగర్, ఏపీఎస్ క్వార్టర్స్, భవాని నగర్ కాలనీలలో మీదుగా బిఆర్ఎస్ సైన్యంతో ఇంటింటికి తిరుగుతూ భారీగా ప్రచారం చేస్తున్న బండారి లక్ష్మారెడ్డికి, డివిజన్ ప్రజలు శాలువాలతో సత్కరిస్తు, మహిళా సోదరీమణులు మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ నేపథ్యంలో కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని, ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మరియు మహిళా సాధికారత గురించి ప్రజలకు స్పష్టంగా వివరిస్తూ, కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు చెప్పే అమలు కానీ హామీలను నమ్మి మోసపోయి గోసపడద్దంటూ, తెలంగాణకు కెసిఆర్ శ్రీరామరక్ష అంటూ, ఉప్పల్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే, కెసిఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రిగా కావాలని, అందుకు ప్రతీఒక్కరు ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు..
ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జూరి పావని రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ కాసం మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.