
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని చార్బోలి నోబెల్ ఫంక్షన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షులుగా మహమ్మద్ మహబూబ్ పాషా వారి బృందం సుమారు 50 మంది తో పాటు మైనారిటీ మహిళలు నేడు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
దేశంలో మైనార్టీ మహిళలకు షాదీ ముబారక్ ఇచ్చిన చరిత్ర ఏ నాయకుడికి లేదని అది కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమైందన్నారు
ఆసరా పెన్షన్ 2వేల నుండి 5వేలకు వికలాంగుల పెన్షన్ 4వేల నుండి 6వేలకు పెంచుతున్నారని
మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా మూడు వేల రూపాయలు అందించబోతున్నారని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే అందిస్తామని ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో చేర్చడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు
11 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను ఓట్లుగా వాడుకున్నారే తప్ప వారి అభివృద్ధికి తోడ్పాటునందించలేదన్నారు
మైనారిటీలను గొప్పగా ఆదుకొని వారి అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చింది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనన్నారు
వరంగల్ తూర్పులో మైనార్టీలకు భారీగా నిధులు కేటాయించడం జరిగిందని మైనారిటీ బంధుతో సాయపడ్డామన్నారు
రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని బలపరుస్తూ కారు గుర్తుపై ఓటు వేసి తనకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,డివిజన్ ఇన్చార్జులు ముఖ్య నాయకులు హాజరయ్యారు