ఉప్పల్ నియోజకవర్గం లో సీటు సాధించిన పేద విద్యార్థులకు మెడిసిన్ ఫీజు కడుతున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని అభినందించిన మాజీ ముఖ్యమంత్రి BRS అధినేత కేసిఆర్.
చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ కి చెందిన అమర్నాథ్ గౌడ్ LB Nagar కామినేని హాస్పిటల్ లో మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. తల్లిదండరులిద్దరూ చనిపోవడంతో మెడిసిన్ చదువు చదివే స్థోమత లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న BLR చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కేసిఆర్ చేతుల మీదుగా ఎర్రవెళ్లి ఫాం హౌస్ లో ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడిసిన్ సీటు సాధించిన వారికి 5 సంవత్సరాలకు అయ్యే ఫీజు మొత్తం చెల్లిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు నేమూరి మహేష్ గౌడ్, నవీన్ గౌడ్, శివ గౌడ్ ,రాజేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు