
అమర గిరి, తెళ్లరాల్ల పల్లి గ్రామాల BRS పార్టీ నుంచి 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక.
కొల్లాపూర్ మండలం అమరగిరి,పాన్ గల్ మండలం తెళ్ళరాళ్ల పల్లి గ్రామాల నుంచి BRS పార్టీ కి చెందిన 30 మంది నాయకులు నేడు కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు సమక్షంలో కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు గెలుపు కొల్లాపూర్ చరిత్రను తిరగరాస్తుంది అని,గత ఎన్నికల్లో అమ్ముడుపోయే నాయకులను గెలిపించి తప్పు చేశామని అందుకే కొల్లాపూర్ అభివృద్ది ప్రదాత జూపల్లి వెంటే మేము అంత ఈ ఎన్నికల్లో జూపల్లి గెలుపు కోసం పని చేయాలనే ఉద్దేశంతో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ ఓబీసీ కో – ఆర్డినేటర్ కేతూరి వెంకటేష్ గారు పెద్దకొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తగిలి కృష్ణయ్య గారు, ఆయా గ్రామాల ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు