
మంత్రి కాకాణి సుడిగాలి పర్యటన”
“గతంలో శంకుస్థాపనల ఆర్భాటం…నేడు ప్రారంభోత్సవాల సంబరం”
“గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు”
“మట్టి రోడ్డు లేకుండా ప్రతి వీధిలోనూ సిమెంట్ రోడ్లు”
“అన్ని హామీలను సంపూర్ణంగా అమలు చేశాం”
“జనవరి నుంచి 3000 రూపాయలు పింఛన్”
“తోటపల్లి గూడూరు మండలం, వరకవిపూడి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఆవిష్కరించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాII కాకాణి గోవర్ధన్ రెడ్డి
మంత్రి కాకాణి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రధాన నాయకులు”
“గత ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటంతో శంకుస్థాపనలు చేసి పనులు విస్మరించారని, తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాII కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు”
“తోటపల్లి గూడూరు మండలం, వరకవిపూడి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇరిగేషన్ కాలువల రక్షణ గోడల నిర్మాణం మొదలైన ఒక కోటి 43 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కాకాణి”
ఈ సందర్భంగా స్థానిక సచివాలయంలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి కాకాణి మాట్లాడుతూ….గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని, మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లు వేసామని, సైడ్ కాలువలు, ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తున్నామన్నారు
వరకవిపూడి గ్రామంలో ఇప్పటివరకు 11 కోట్ల 36 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేసిన మంత్రి కాకాణి
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించినప్పుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చినట్లు వివరించిన మంత్రి కాకాణి
గ్రామాల్లో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి ఎవ్వరూ ఎక్కడికి తిరగకుండా నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందించిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందన్న మంత్రి కాకాణి
దేశంలో ఎక్కడా లేనివిధంగా 2750 రూపాయలు అత్యధిక పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ పోరాష్ట్ర మని, మన దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రాలు లేవన్న మంత్రి కాకాణి
జనవరి నుంచి 3000 రూపాయలు పింఛన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్న మంత్రి కాకాణి
గ్రామాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చి, ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నట్లు వివరించిన మంత్రి కాకాణి
మీ కుటుంబాలకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అని ధైర్యంగా అడిగిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని తెలియజేసిన మంత్రి కాకాణి
సుదీర్ఘకాలంగా, అపరిష్కృతంగా ఉన్న ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని, ఇందులో భాగంగా అసైన్మెంట్, చుక్కల భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించామన్న మంత్రి కాకాణి
ఒక్క సెంటు భూమి ఉన్న రైతుకు, ఇంటి స్థలం ఉన్న వారికి కూడా పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పిస్తున్నట్లు వివరించిన మంత్రి కాకాణి
సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసాధారణ నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారని తెలియజేసిన మంత్రి కాకాణి
రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తామని మంత్రి కాకాణి పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు