మీర్పెట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్‌లో శ్రీ ఎర్ర పోచమ్మ అమ్మవారి శిలా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందారు.