
అక్రమ అరెస్టులతోని వికలాంగుల ఉద్యమాలను ఆపలేరని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపధ్యంలో చిలుకూరు పోలిసులు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ను తెల్లవారుజామున ముందస్తుగా ఆరెస్టు చేశారు ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ సమాజంలో అణగరినవర్గమైన వికలాంగుల సమాజం హక్కుల కోసం పోరాడుతున్న తనలాంటి ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని 76 ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి రాజ్యాధికారం సాధించేందుకు తన తృటిలో ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతానని వికలాంగుల జూతి హక్కుల కోసం తాను ప్రాణ త్యాగానికైనా ఎనకాడబోనని తనపై ప్రభుత్వం 1000 అక్రమ కేసులు పెట్టిన అక్రమ నిర్బంధాలు చేసిన సంతోషంగా భరిస్తానని వికలాంగుల ఓట్లతోని గద్దెనెక్కిన సకలంగుల పాలకులు వికలాంగుల సమస్యలపై చట్టసభల్లో మాట్లాడకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరిస్తున్న నేపథ్యంలోనే రాజ్యాధికార సాధనకై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ప్రభుత్వ అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలు నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సంఘం తరఫున సూర్యాపేట కోదాడలో అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలిపారు