లంకెబిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని రేవంత్ అంటున్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రేవంత్ చేతులు ఎత్తివేశారు.
రాహుల్ ఈ జన్మకి ప్రధాని అవుతారా ?
40 సీట్లు గెలిచే వారు ఎలా ప్రధాని అవుతారు.
మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మోదీ అయితే,
మాట ఇచ్చి తప్పే వారు కేసీఆర్, రేవంత్.
కేసీఆర్ కి ఓటు వేస్తే వృధా..
ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ చేస్తా అని చెప్పిన మోడీ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాదిగ జాతికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
- ఈటల రాజేందర్.
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం సూరారంలో రోడ్ షో నిర్వహించిన ఈటల రాజేందర్. పాల్గొన్న మల్లారెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, భరత్ రెడ్డి, శ్రీరాములు, మల్లేష్, గణేష్, రాము తదితరులు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ :
సూరారం వీదులలో హారతిపట్టి, పూలవర్షం కురిపించిన ఆడబిడ్డలకు, యువకులకు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
పెద్దింటి బిడ్డ కాబట్టి మోదీ గారు దేశంలో 4 కోట్ల ఇళ్ళు కట్టించారు.
కేసీఆర్ ప్రగల్భాలు పలికారు తప్ప పేదవారికి ఇల్లు ఇవ్వలేదు.
2 లక్షల ఇళ్లు మోదీ గారు ఇస్తే.. అవి కూడా కేసీఆర్ కట్టలేదు.
పోరాడి తెచ్చుకున్న ఇళ్ల జాగాలు కూడా కేసీఆర్ లాక్కున్నాడు.
12 కోట్ల టాయిలెట్స్ కట్టించి మోదీ గారు మహిళల ఆత్మగౌరవం కాపాడారు.
పేదలు చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడకుండా ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకుంటున్నారు.
ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు.
జన్ ధన్ అకౌంట్స్ ఓపెన్ చేసి డిజిటల్ పేమెంట్స్ చేయిస్తున్నారు.
500 ఏళ్ల కల అయోధ్య రామమందిరం నిర్మించి ఇచ్చారు మోడీ గారు.
మోదీ గారే మనకు శ్రీరామ రక్ష.
నన్ను గెలిపిస్తే..
మల్కాజిగిరిలో రోడ్లు, డ్రైనేజీల సమస్య తీరుస్తా.
పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తా.
మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మోదీ.
మాట ఇచ్చి తప్పే వారు కేసీఆర్, రేవంత్.
కేసీఆర్ మాట ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.
రేవంత్ మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, పెన్షన్ 2వేల నుండి 4 వేలు పెంచుతా అన్నారు , వికలాంగులకు 6 వేలు ఇస్తా అన్నారు. పెళ్లికి లక్షతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్ కి 12000, రైతులకు 15000 ఇస్తా అన్నారు.. ఇచ్చారా ?
ఇప్పుడు కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చాడు..
లంకె బిందెలు ఉన్నాయి అని వచ్చా ఖాళీ బిందెలు ఉన్నాయి అంటున్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రేవంత్ చేతులు ఎత్తివేశారు.
ఒడ్డెక్కే దాకా ఓడమళ్లప్ప అన్నాడు.. ఇప్పుడు బోడ మల్లప్ప అంటున్నారు.
రాహుల్ ఈ జన్మకి ప్రధాని అవుతారా? 40 సీట్ల వారు ఎలా ప్రధాని అవుతారు.
కేసీఆర్ కి ఓటు వేస్తే వృధా.
మోదీ గారికి ఓటు వేస్తే..
బాంబుల పేలుళ్లు ఉండవు, తెగిపడిన శరీరాలు ఉండవు.
ప్రశాంత జీవనం అందించారు.. అందిస్తారు.
కరోనా వచ్చినప్పుడు వాక్సిన్ అందించి మన ప్రాణాలు కాపాడారు.
నేనేంటో మీ అందరికీ తెలుసు..
ఎన్ని కేసులు పెట్టినా వెరవకుండా తెలంగాణ ఉద్యమం చేసినవాన్ని.
ఆర్ధిక మంత్రిగా సన్నబియ్యం అందించినవాణ్ణి.
కరోనా మంత్రిగా ఎవరు చేయని సాహసం చేసి మీకు అండగా ఉన్నవాణ్ణి.
మీకు 24 గంటలు అందుబాటులో ఉంటా.. కాలికి ముళ్లు గుచ్చుకుంటే పంటితో పీకే సేవ చేస్తా.
మీ సమస్యల పరిష్కారం కోసం మీకు నిత్యం అండగా ఉంటాను.
ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ చేస్తా అని చెప్పిన మోడీ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాదిగ జాతికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు