టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య ప్రచారం ఆత్మకూరు మండల కేంద్రంలో మొదటి రోజు జరిగింది..ఉదయం రాయపల్లి గ్రామం నుండి ప్రారంభమై సర్వేపల్లి,తిమ్మాపూర్, మొరిపిరాల,కల్వపల్లి,సింగారం,మోదుగుంట,చిన్న గూడెం, కొరటికల్,ఆత్మకూరు గ్రామాల్లో ప్రచారం కొనసాగింది.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య కు గ్రామస్థులు కార్యకర్తలు,నాయకులు మహిళలు, మంగళారతులతో ఘానా స్వాగతం పలికారు.ప్రతి గడపకు వెళ్తూ ఆరు గ్యారెంటీలను వివరిస్తూ,కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.కాగా మండలంలో పర్యటించిన అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి.రాజపేట మండలంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పిటిసి నాగిర్తి రాజిరెడ్డి, రాజపేట మండల కేంద్ర బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఆడపు ఈశ్వరమ్మ శ్రీశైలం, మండల రైతు బంధు సమన్వయ అధ్యక్షుడు గౌటే లక్ష్మణ్జ్, రఘునాథపురం గ్రామ సర్పంచ్ శ్రవణ్,మాజీ సర్పంచ్ అంకతి బాలయ్య,మాజీ ఎంపీపీ పులి సత్యనారాయణ, రసూరి నర్సయ్య,వీరితోపాటు మాజీ సర్పంచ్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు 400 మంది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య సమక్షంలో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.