Friday, March 28, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో జెండా ఎగరవేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్నందుకు చాల సంతోషంగా వుంది అని , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం చావు నోట్లో తల పెట్టి 15 సంవత్సరాలు రాజీలేని పోరాటం చేసి , అమరవీరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రము సిద్దించింది. స్వరాష్ట్రం సిద్ధించాక పదేండ్లలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంలో ఏరంగంలో చుసిన తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దారు ఇదంతా అధినేత కేసీఆర్‌ వల్లే సాధ్యమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చేరిపేయడమేనని పేర్కొన్నారు. అలంటి ఆలోచనను కాంగ్రెస్ ప్రేభుత్వం విరమించుకోవాలని కోరుతున్నాము.

కేసీఆర్ పదేండ్లలో యాభై ఏండ్ల అభివృద్ధి చేసి చూపిస్తే ఐదు నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఐదేండ్లు వెనక్కి తీసుకుపోయింది. రైతులు శ్రమించి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వాళ్ళ కాంగ్రెస్ పాలనలో రైతులకు మిగిలింది కన్నీళ్లే. 420 హామీలు ,ఆరు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది . అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ వైఫల్యం చెందింది. ఎన్నికల ముందు ఒకమాట , ఎన్నికల తరువాత ఒకమాట ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయమని అడిగితె ముఖ్యమంత్రి ఏ ఊరికిపోతే ఆ ఊరి దేవుడిపై ఒట్టు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చెప్పారు కానీ ఏమి చేయలేక పోయారు…. పదేండ్ల మోడీ పాలనలో దేశంకు , తెలంగాణ రాష్టానికి చేసింది ఏమి లేదు తెలంగాణ నేలపై విషం చిమ్మడం ,తెలంగాణ కు సాగు నీటి ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వలేదు . ఒక నవోదయ , ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. నిత్యావసర ధరలు , పెట్రోల్ , డీసెల్ ధరలు పెంచుతూ , ప్రభుత్వ సంస్థలను ప్రవేటీకరణ చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఎప్పటికైనా ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్‌ పార్టీయే . బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో అధినేత కేసీఆర్ బయటకు వచ్చాక ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది . కాంగ్రేస్ బిజెపి పార్టీలో భయం మొదలైంది. రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీలకంటే బీఆర్ఎస్‌ అధిక స్థానాలు గెలిసే అవకాశం మున్నది. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్‌ పార్టీయే తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్‌ పార్టీయే శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈరోజు డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్లో రౌండ్ బిల్డింగ్ దగ్గర తదంతరం మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో హెచ్ బి కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, జి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కాసం మైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్దాపురం కుమారస్వామి, బేతాళ బాలరాజు, షేర్ మణెమ్మ, శిరీష రెడ్డి, లక్ష్మి నారాయణ, సింగారపు మనమ్మ, మురళి పంతులు, రహీమ్, గుమ్మడి రాజయ్య, సింగారపు రాజు, మాట్లగిరి, రాజిరెడ్డి, పిట్టల రాజు, శివదేవ చారి, దేవి రాజు, సత్యనారాయణ, రామ్ భద్రయ్య, భాస్కర్ , సత్యనారాయణ గౌడ్, గడ్డం శీను, మొగులయ్య,, పంతులు నరసింహ, సకినాల రవి, పెద్దాపురం కుమార్, గోవర్ధన చారి, ఎంపీ దాసు, హరినాథ్ రెడ్డి, సాంబశివరెడ్డి, సరిత, కవిత, మౌనిక, ప్రమోదు, రేణుక, గణపతి రెడ్డి, బి శ్రీనివాస్ రెడ్డి, మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!