కాప్రా శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో 78వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాలనీ అధ్యక్షుడు చంద్రమౌళీశ్వర రావు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కోశాధికారి శంకర్రావు, సలహాదారులు ఠాగూర్, కృష్ణన్ మరియు కాలనీ వాసులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు