Wednesday, April 16, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

కొకపేట లో 250 కోట్ల రూపాయల భూములు కబ్జాలు చేసిన వారిని కొల్లాపూర్ నుంచి తరిమేద్దాం

పెద్దకొత్తపల్లి మండలంలో BRS పార్టీ నీ క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్టీ. 6 గ్రామాల నుంచి 400 మందికి పైగా మాజీ మంత్రి జూపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక.
పెద్ద కొత్తపల్లి మండలం జొన్నల బోగడ,నారాయణ పల్లి, సాతాపూర్, దేవినేని పల్లి, మరికల్ మరియు పెద్ద కార్పాముల గ్రామాల నుంచి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు సమక్షంలో BRS పార్టీ ఉప సర్పంచ్ లు,వార్డ్ మెంబర్ లు,సింగిల్ విండో డైరెక్టర్ లు,BRS పార్టీ కీలక నాయకులు మరియు కార్యకర్తలు 400 మందికి పైగా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

BRS పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 6 గ్రామాల BRS కీలక నాయకులు

నారాయణ పల్లి గ్రామం నుంచి గ్రామ ఉప సర్పంచ్ తిరుపతమ్మ గారు,వార్డ్ మెంబర్ బాలయ్య తో పాటుగా 70 మందికి BRS నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జొన్నల బొగడ గ్రామం నుంచి సింగిల్ విండో డైరెక్టర్ పుట్టపాగ బాలమ్మ గారు,నలుగురు గ్రామ వార్డ్ మెంబర్ సభ్యుల తో పాటుగా 25 మంది BRS పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దేదినేనిపల్లి గ్రామం నుంచి గ్రామ మాజీ సర్పంచ్ నాగయ్య గారితో పాటుగా 35 మంది BRS పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పెద్దకార్పాముల గ్రామం నుంచి BRS, బీజేపీ పార్టీ లకు సంబంధించిన యూత్ నాయకులు 70 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మరికల్ గ్రామం నుంచి 40 మంది నాయకులు,కార్యకర్తలు BRS పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సాతాపుర్ గ్రామం నుంచి 50 మందికి పైగా BRS నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే భిరం హర్షవర్ధన్ రెడ్డి చేస్తున్న భూ కబ్జాలు,అవినీతి పాలన,పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని అరాచక లతో గ్రామాలలో భిరం అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలను నిరసిస్తూ ఊర్లకు ఉర్లే BRS ను వదిలి కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారు.జూపల్లి నాయకత్వమే మళ్లీ రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.

ఈ కార్యక్రమంలో పెద్ద కొత్తపల్లి మండల ఎంపిపి సూర్య ప్రతాప్ గౌడ్ ,జెడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య ,సింగిల్ విండో,నాయినిపల్లీ మైసమ్మ చైర్మన్ శ్రీనివాసులు ,దండు నరసింహ ,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!