గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వేసిన ఓటు 7500 కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలను తెచ్చింది
సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి ఆరంభం మాత్రమే
సూర్యాపేట ను దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
బీఆర్‌ఎస్‌లోకి జోరుగా వలసలు
మంత్రి జగదీష్ రెడ్డి వంటే మా పయనం అంటూ కాంగ్రెస్ కు గుడ్ బై
బీఆర్ఎస్ లో చేరిన ఆత్మకూర్ మండలం గట్టికల్ కు చెందిన 60 దళిత కుటుంబాలు
గులాబీ కండువాలు కప్పి ఆహ్వానం పలికిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట నియోజకవర్గం లో అధికార బీఆర్ఎస్ పార్టీ లోకి వలసల జోరు కొనసాగుతుంది. దళిత బంధు పథకం తో తమను ఆర్థికంగా అభివృద్ధి చేయడం తో పాటు సామాజిక గౌరవానికి భరోసా కల్పించిన బీఆర్ఎస్ పార్టీ, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి తోనే మా పయనం అంటూ ఆత్మకూర్ ఎస్ మండలం గట్టికల్ గ్రామానికి చెందిన 50 షెడ్యూల్డ్ కులాలకు చెందినకాంగ్రెస్ కుటుంబాల తో పాటు వివిధ పార్టీల కు చెందిన నేతలు కార్యకర్తలు మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీ లో చేరారు. పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికిన మంత్రి, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు లో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. ఏ పార్టీల వల్ల తమ బ్రతుకులు బాగుపడ్డాయో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 2014లో బీఆర్ ఎస్ కు వేసిన ఓటు 7500 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి కేవలం ఆరంభం మాత్రమే అన్న మంత్రి, ఇంకా చేయవలసింది చాలా ఉందన్నారు. పార్టీలకతీతంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అండగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో బచ్చలకూరి శేఖర్, ఇరుగు నవీన్, బచ్చలకూరి కరుణాకర్, బచ్చలకూరి అరవింద్, గుర్రాల రాంబాబు తో పాటు దళిత కుటుంబాలు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు