గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఈస్ట్ జోన్ పరిధిలోని ఎల్బీనగర్ డిసి సర్కిల్ 3 హయత్ నగర్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, ACP, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు దొరికిపోయారు.
ACB అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, TPS ఉమ ACP పై లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో, అధికారులు వల పన్ని ఒక వ్యక్తీ నుండి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ACP, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అంతేకాకుండా, టౌన్ ప్లానింగ్ ఆఫీసును తనిఖీ చేసిన అధికారులు, అక్కడ ఉన్న రికార్డులను సీజ్ చేశారు. లంచం తీసుకునేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఆధారాలను కూడా ACB అధికారులు స్వాధీనం చేసుకున్నారు.