Monday, April 21, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

తెలంగాణాలో  బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యకపోతే…కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి సంకెళ్లే

అంతర్గత రాజకీయాలతో..అతి తెలివి తేటలతో భాజపా నాయకులు గానీ…జాతీయవాదులు గానీ ప్రయోగం చేస్తే…దేశ ద్రోహం చేసినట్టే…

ఈ ఎన్నికల తరువాత మోడీ గారు తీసుకోబోయే అతి ముఖ్యమైన మహాద్భుతమైన విషయానికి గండి కొట్టినట్టే….

రాష్ట్రం ఎన్నికలే కదా..ఇక్కడ కేసిఆర్ కి వేద్దాం…లోక్ సభకు ఎలాగూ మోడీకే అనుకునే పిచ్చి పువ్వులు కొన్ని ఉన్నాయి…

ఇటువంటి మేధావులు …మతి తప్పిన వాళ్ళూ చాలా మంది ఉన్నారు…

పార్లమెంటు అంటే…రెండు సభలు బాబాయిలూ….

ఒకటి లోక్ సభ..మరొకటి రాష్ట్రాల సభ..అంటే రాజ్యసభ…

ఏదైనా బిల్లు పాస్ కావాలంటే…రెండు సభలూ ఓటింగ్ చెయ్యాలి…

రాజ్యాంగంలో ఎమర్జన్సీ టైములో  ఇందిరాఫిరోజ్ ఖాన్ పెట్టిన అయోమయం అంధకారం నింపిన మాటలు తీసెయ్యాలంటే…పదహారు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదించాలి…

అంటే..దేశాన్ని సమర్థవంతంగా నడిపించాలంటే…రెండు సభల్లోనూ… కనీసం ఇరవై రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉండాలి…

తూతూ మంత్రంగా లోక్ సభ కి గెలిపించేస్తే సరిపోదు…

లోక్సభలో ముష్టి మూడొందల సీట్లు ఇచ్చి…పీ ఓ కే పట్టుకురా… దేవాలయాలు ప్రభుత్వ చెర నుండి తీసెయ్యి…

వ్యవసాయ చట్టాలు చెయ్యి… ఖలిస్తాన్ ను పండబెట్టు…బెంగాల్ నుండి రోహింగ్యాలను వెళ్లగొట్టు…

ఆంధ్రాను క్రైస్తవం నుంచి విడిపించు…గోమాత ను రక్షించు…

అదేంటి కోర్టులు అలా టెర్రరిస్టులను విడిచి పెట్టేస్తే చూస్తూ ఊరుకోవడం…మాల్యాను తీసుకరా… 

పది హేను లక్షలు అకౌంట్ లో వెయ్యి… లిక్కర్లో ఆమెను లోపలెయ్యు… కాళేశ్వరం లో అవినీతి విచారించూ…నీ బొంద చెయ్యి..నీ భోషాణం చెయ్యి అంటే దొబ్బదు…

కాళ్ళకు సంచీ తొడిగి…పరిగెట్టమంటే కుదరదు…

2035 కల్లా భారత్ అగ్రరాజ్యం కావాలంటే…

భాజపాకు రాజ్యసభలో 175 సీట్లు ఇవ్వాలి… 

తొట్టెంకూడి కుటుంబ పార్టీలు బ్లాక్ మెయిల్ చెయ్యలేనంత మెజారిటీ ఇవ్వాలి…

అంటే ఇరవై రాష్ట్రాల్లో కనీసం మూడింట రెండు వంతుల ఎమ్మేల్యేలు బీజేపీ కి ఇవ్వాలి…

పశ్చిమ బెంగాల్ 16..తెలంగాణ 7..తమిళనాడు 18..పంజాబ్ 7..కేరళ 9…కర్ణాటక 12…బీహార్ 16.. ఆంధ్రప్రదేశ్ 11…ఒడిశా 10..ఇలా 100 కు పైగా రాజ్యసభ ఎంపీలు పరోక్షంగా కాంగ్రెస్ గుప్పిట్లో ఉన్నారు…

ప్రాంతీయ కుల కుటుంబ పార్టీలు తమ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి…ఈ సంఖ్యను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి…

మోడీ షా లు కాబట్టి కొందర్ని మెప్పించి..కొందర్ని ఒప్పించి… జోకి …పెద్ద పెద్ద దేశ గతిని మార్చిన నిర్ణయాలు తీసుకున్నారు…

ఇంకొకరు ఇంకొకరు అయితే… శంకర గిరి మాణ్యాలు పట్టేసేవారు…

ఇప్పుడు జైల్లో ఉన్నాయన..వాజ్ పేయిని ముప్పు తిప్పలు పెట్టీ… మోడీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అప్పట్లో గంటలు గంటలు వెయిటింగ్ చేయించాడు…

ఇప్పటికీ ఆ ముద్ద దిగిన బలుపే ఈ రాష్ట్ర అధినేతలు చూపిస్తున్నారు…

ఇది పర్సనల్ ఈగోల గోల కాకూడదు…..

దేశం కోసం మోడీ కావాలంటే…రాష్ట్రం లోనూ అధికారం ఇచ్చి తీరాల్సిందే…

స్థానిక అవసరాలూ..బర్రెలు.. గొర్రెలు… చింతపండు కాదు……

మన్నూ మశానం అంటూ…ఈ కుల కుటుంబ ఉప ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇవ్వకూడదు… 

కాబట్టి…క్లియర్ గా…చెప్పేది ఏంటంటే…

తెలంగాణాలో ఏడు రాజ్య సభ సీట్లు రావాలంటే…ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ తో బీజేపీ గెలవాలి…

కార్యకర్తలు..నాయకులు సగం సగం జ్ఞానంతో…అర్థ మెదడుతో పని చెయ్యకూడదు…

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఏడు రాజ్యసభ స్థానాలకు కూడా జరుగుతున్నట్టే లెక్క…

వీటి విలువ అఖండ భారత్ సాధించుకున్నంత…వీటి విలువ భారత్ అగ్రరాజ్యంగా మారేంత….

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!