
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR), ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన జియంఆర్ కి అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు.
ఈ కార్యక్రమంలో భాగంగా అమడబాకుల గ్రామ కాంగ్రెస్ పెద్దలు, నాయకుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుండి మాజీ సర్పంచ్ మన్యం, సలీం , ఇద్దరు వార్డ్ మెంబెర్స్ తో పాటు 52 మంది బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అదేవిధంగా అప్పరాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు U. శ్రీనివాసులు, లక్ష్మీ నారాయణ, లోక్య నాయక్, జంగల గోపి, H. మన్యం, మల్లేష్, పరశురాం మరియు 24 మంది బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ ను వీడి దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జిఎంఆర్