
దేవరకద్ర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR), టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు.
అనంతరం దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు గోపి అంజన్న, రామాంజనేయులు, రామకృష్ణ, బాలు, బోయ శీను, వెంకటయ్య, వీరేష్, బోయ రవి, గానయ్య, కొండయ్య, రామకృష్ణ, బాలస్వామి గౌని తిమ్మన్న, వెంకటన్న, నర్సింహులు, హోటల్ నర్సింహులు తదితరులు కాంగ్రెస్ నాయకులు కొండ అంజన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జియంఆర్ గారు, అరవింద్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అదేవిధంగా చిన్నచింతకుంట మండలం ఫర్దిపూర్ గ్రామ పరిధిలోని తండాల నుండి ఫర్దిపూర్ గ్రామ నాయకులు ఆధ్వర్యంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు