
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ, నవరత్నాల్లో భాగమైన నిరుపేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు పక్కా ఇంటి నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.వైఎస్సార్ జగనన్న కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి, పేదింటి స్వగృహప్రవేశాలు గురువారం ప్రారంభమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గృహప్రవేశాలలో భాగంగా ఐదు లక్షల ఇళ్లను స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు సామర్లకోటలో ప్రారంభించారు. జిల్లాలో మైలవరం నియోజకవర్గంలోని చంద్రాలలో అధికారులు, ప్రజాప్రతినిధుల నడుమ ఈ వేడుకలను గురువారం కన్నులపండువగా నిర్వహించారు. మైలవరం శాసనసభ్యులు వెంకట కృష్ణప్రసాదు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, కెడిసిసిబి చైర్ పర్సన్ తాతినేని పద్మావతి పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.