Tuesday, December 24, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

మచ్చబొల్లారంలో రోడ్ షో లో పాల్గొన్న ఈటల రాజేందర్

అబ్ కీ బార్ చార్ సౌ పార్.. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ ఇది ఇప్పుడు భారత ప్రజలనినాదం.
భారతీయులు తలెత్తుకొని సగర్వంగా నిలబడేలా చేసిన వ్యక్తి మోదీ.
మనకు ఇల్లు కావాలంటే మోదీ గారు మళ్ళీ రావాలి.
రాష్ట్రప్రభుత్వం ఇల్లు కట్టించకపోతే కేంద్రమే నేరుగా కట్టిస్తుంది అని ప్రధాని ప్రకటించారు.
కరోనా సమయంలో 80 కోట్ల పేదలకు 5 కేజీల బియ్యం అందించి ఆకలి తీర్చారు.
12 కోట్ల టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం నిలబెట్టారు.
మల్కాజిగిరి ఎం కావాలన్నా ఇస్తా అని మోదీ గారు హామీ ఇచ్చారు.
నన్ను గెలిపించండి ప్రతి సమస్య తీరుస్తా అని హామీ ఇస్తున్న.
కేసీఆర్ మాటలు తప్ప చేతలు లేవు అని తేలిపోయింది కాబట్టే మొన్న ఎన్నికల్లో BRS ను బొందపెట్టారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడవాడికి అనేక హామీలు ఇచ్చారు.. వంద రోజులు అయినా ఒక్కటికూడా అమలుచేయలేదు. వాటిని అమలుచేయించే కొట్లాటలో కూడా నేను ముందు ఉంటాను.
రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి.. చేతలు మాత్రం తంగెళ్లు దాటడం లేదు.
పంటలు ఎండిపోతున్నాయి.. వీరికి పరిపాలించే సత్తా లేదు అని గ్రామాల్లో అనుకుంటున్నారు.
మోదీ గారి సర్కార్ అండతో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తా అని హామీ ఇస్తుస్న.
ఈ ప్రాంత ప్రజలను ట్రాఫిక్ జామ్ ఇబ్బందులనుండి బయటపడవేస్తాం.. తిరుమలగిరి కొంపల్లి రూట్ లో మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ అందుబాటులోకి తీసుకువస్తాం. అల్వాల్ నుండి షామీర్ పేట వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తున్నాం. చర్లపల్లి రూట్ లో కొత్త రైల్ ను ప్రవేశపెట్టబోతున్నాం.
500 ఏళ్ల క్రితం రామమందిరం కూలగొడితే దానిని తిరిగి నిర్మంచిన దేశం బాగుండాలి అని కోరుకున్న వ్యక్తి నరేంద్రమోడీ. కాంగ్రెస్ పాలనలో బాంబుల పేలుళ్లతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
మోదీ పాలనలో బాంబుల మోతలు లేవు, తుపాకీ తూటాలు లేవు.
మోదీ పాలనలో భారత్ ఆర్ధిక వ్యవస్థ అమెరికాతో పోటీ పడుతుంది.
ఇప్పుడు అన్ని వస్తువులు మనమే తయారు చేసుకుంటున్నం.
మోదీ దేశానికి శ్రీరామ రక్ష.. పేదలకు కడుపునిండా తిండి, రోడ్లు, ఫ్లై ఓవర్లు అన్నీ మోదీ ఇస్తున్నారు కాబట్టి బీజేపీకి.. నాకు ఓటు వేసి గెలిపించండి. కాలులో ముళ్లుగుచుకుంటే పంటితో పీకే సేవ చేస్తా.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!