వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం
ఉత్తరాంధ్ర సేవాసమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె సుబ్రమణ్యం
వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థల ముందుకు వచ్చి మరిన్ని చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె సుబ్రహ్మణ్యం కోరారు. ఉత్తరాంధ్ర సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం కుషాయిగూడ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ కూలర్ చలివేంద్రాన్ని మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బిఆర్ఎస్ ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సేవాసమితి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు మాట్లాడుతూ మండుతున్న వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు వచ్చి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సేవా సమితి ఫౌండర్ అధ్యక్షులు దండుగుల తారకేశ్వరరావు, వంజరపు సింహాచలం, టెంబూరు ఎర్రం నాయుడు, బైరి లక్ష్మణ్, వి. చిన్నికృష్ణ, కాళ్ల లక్ష్మీనారాయణ, బి. శివ, బి. చిట్టిబాబు, బోడ శ్రీనివాసరావు (అప్పన్న), టి. శేషగిరి, జి. కోటేశ్వరరావు, జి. రాము, కె. అనిల్ కుమార్, బి. ఆనంద్ రెడ్డి, ఎల్. శంకర్ నారాయణ, కుమ్మన శంకర్, బట్ట ఉమామహేశ్వరరావు, నక్క తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు