Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

శాంతియుత ఎన్నికలకు భరోసా: ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న ఎసిపి మహేష్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి ప్రజలకు భరోసా కల్పించడానికి, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎసిపి మహేష్ మాట్లాడుతూ, ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని, ప్రజల భద్రత బాధ్యత మాదేనని స్పష్టం చేశారు.

ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ఓటర్లలో భరోసా కల్పించడమే లక్ష్యమని ఆయన వివరించారు.

కార్యక్రమంలో సిఐ వీరాస్వామి, డిఐ రాజు, సిఐఎస్ఎఫ్ బలగాలు తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!