
మాటివ్వండి, మరింత ఉత్సాహంతో, నమ్మకంతో పోరాటం చేసి, అవినీతి పాలనను అంతం చేసి కొల్లాపూర్ ప్రాంతానికి నూతన వైభవాన్ని తీసుకొస్తా.
– బీజేపీ పరివర్తన్ యాత్ర లో ఎల్లేని
కొల్లాపూర్ నియోజక వర్గంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఎల్లేని సుధాకర్ రావు నిర్వహిస్తున్నటువంటి బిజెపి పరివర్తన్ యాత్ర ఈరోజు కొల్లాపూర్ మండలం ఎన్మన్ బెట్ల మరియు నార్లపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది..
సుధాకరన్నా మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో ఏ ఇంటికెళ్లిన,ఎ గడప తొక్కిన సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని ఎల్లేని ఆవేదన చెందారు..
రాష్ట్రం లో దీనమైన పరిస్థితి ఉంటే మన కొల్లాపూర్ నియోజకవర్గం లో అంతకు మించి సమస్యలు ఉన్నాయని,గత 20 సంవత్సరాలు గా పూటకో పార్టీ మారుతూ,కొల్లాపూర్ ప్రజలను మభ్యపెడుతూ మనబిడ్డల బ్రతుకులను మద్యానికి బానిసలుగా చేస్తూ, ఇన్ని రోజులు కొల్లాపూర్ ను దోచుకున్న నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు ఎల్లేని…
ఈ కార్యక్రమంలో ఎల్లేని తో పాటు పలువురు రాష్ట్ర జిల్లా,మండల,వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…