
మాటివ్వండి, మరింత ఉత్సాహంతో, నమ్మకంతో పోరాటం చేసి, అవినీతి పాలనను అంతం చేసి కొల్లాపూర్ ప్రాంతానికి నూతన వైభవాన్ని తీసుకొస్తా
బీజేపీ పరివర్తన్ యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లేని..
కొల్లాపూర్ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఈరోజు పెద్దకొత్తపల్లి మండలం చిన్నకారుపాముల గ్రామం మరియు మరెడుమాన్ దీన్నే గ్రామాలలో పరివర్తన్ యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఎల్లేని సుధాకర్ రావు
సుధాకరన్నా మాట్లాడుతూ “నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కొల్లాపూర్ ని అభివృద్ధి చేస్తానని ” , మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిపేరుకో నమ్మి ఓటేస్తారా ? ఒక్కసారి ఆలోచించండి.. కొల్లాపూర్ అభివృధి కోసం మీకోసం… మీసమస్యల పరిష్కారం కోసం. మీ పిల్లల భవిష్యత్తుకోసం నా ఉన్నత ఉద్యోగాన్ని త్యాగం చేసి మీలో ఒకడిగా నిత్యం ప్రజాక్షేత్రంలో పోరాడుతున్న…
మీరిచ్చిన ఈ అవకాశాన్ని కొల్లాపూర్ ను విద్య, వైద్య, రవాణా, ఉపాధి రంగాలతో పాటు అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే నెం. 1.నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు..
మాయ మాటలు చెప్పి .. ఓట్లు దండుకొని ..కొల్లాపూర్ ను కొల్లగొట్టి .. అవినీతి సొమ్ముతో ఊరేగుతున్న స్వార్థ రాజకీయనాయకులకు బుద్ధిచెబుదాం..
రాష్ట్రం లో దీనమైన పరిస్థితి ఉంటే మన కొల్లాపూర్ నియోజకవర్గం లో అంతకు మించి సమస్యలు ఉన్నాయని,గత 20 సంవత్సరాలు గా పూటకో పార్టీ మారుతూ,కొల్లాపూర్ ప్రజలను మభ్యపెడుతూ మనబిడ్డల బ్రతుకులను మద్యానికి బానిసలుగా చేస్తూ, ఇన్ని రోజులు కొల్లాపూర్ ను దోచుకున్న నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని యువతను కోరారు ఎల్లేని…
ఈ కార్యక్రమంలో ఎల్లేని తో పాటు పలువురు రాష్ట్ర జిల్లా,మండల,వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…