జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి ప్రజా దర్బార్ విజ్ఞప్తులను తీసుకెళ్లిన పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నియోజకవర్గంలో స్థానిక సమస్యలపై నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తుంది. ప్రజా దర్బార్ కు వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టుగా పరమేశ్వర్ రెడ్డి తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞప్తులను జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మంత్రిని పరమేశ్వర్ రెడ్డి కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారని పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.