
దేవరకద్ర నియోజకవర్గం : భూత్పూర్ మున్సిపాలిటీ సిద్ధయ్య పల్లిలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు బొడ్డు రమేష్, శ్రీకాంత్, మహేష్, బాలరాజ్ మరియు NSUI మండల అధ్యక్షులు వెంకటేష్ నాయక్ తదితరుల ఆధ్వర్యంలో 150 మంది బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు జి. మధుసూధన్ రెడ్డి (GMR)
అనంతరం జిఎంఆర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు అవుతున్న మండలం లో అన్నసాగర్, సిద్ధయ్య పల్లి లో తప్ప ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించలేదని, నిర్మించిన ఇండ్లు కూడా కమిషన్లు ఇచ్చిన వారికి అమ్ముకున్నారని, నిజమైన అర్హులు ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని అల వెంకటేశ్వర్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిఎంఆర్. డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడుతుందని అర్హులందరికీ సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల సహాయం అందిస్తామని, మహాలక్ష్మీ పథకంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు రూ.2500 నగదు, రూ.500 లకే గ్యాస్ అందిస్తామని తెలిపారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వైద్యం అందించడంతో పాటు విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు అందిస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంట బోనస్ క్వింటాలుకు 500 రూపాయలు చెల్లిస్తామని, యువ వికాస పథకం ద్వారా విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా రుణం చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ అందిస్తామన్నారు.
*ఈ కార్యక్రమంలో భూత్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లిక్కి నవీన్ గౌడ్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారెడ్డి, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లిక్కి విజయ్ గౌడ్, అమిస్తాపూర్ నాయకులు కెంద్యాల నరేందర్, పవన్, శివ రాములు గారు, మైనార్టీ మండల అధ్యక్షులు పాషా రవి, శ్రీశైలం, వెంకటయ్య, తులసి రామ్, మన్నన్, బాలస్వామి భూత్పూర్ మున్సిపాలిటీ, అమిస్తాపూర్, సిద్దయ్యపల్లి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు