శ్రీరామ్ నగర్ కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం కాప్రా సర్కిల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను కలిసి మద్దతు కోరారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు శాలువాతో సత్కరించి,మద్దతును ప్రకటించారు.గతకొన్ని ఏళ్లుగా కాలనీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాలని వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి నావంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుంకు శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి,పి పాపి రెడ్డి,ఎడ్ల జగన్ మోహన్ రెడ్డి, ఎన్ వెంకటేశ్ యాదవ్, గోలి సంతోష్, పి ఎన్ స్వామి కాలని వాసులు పాల్గొన్నారు.