
ఇలా వచ్చి అలా పోయే వాళ్లకు ఓటు వేయ్యోద్దు
అపతి సంపతీ లో అదుకునే దయాకర్ రావు నే గెలిపించండి దయాకర్ రావు విజయం ఖాయమైంది కెసిఆర్ ఆశీస్సులతో అధ్బుతంగా పని చేసిండు అనేక అవార్డులను తెచ్చిండు దయాకర్ రావు కి లక్ష ఓట్ల మెజారిటీ ఖాయందయాకర్ రావు ని గెలిపిస్తం అన్న పాలకుర్తి ప్రజలకు ధన్యవాదాలుతొర్రూరు సభ వేదికపై మంత్రి ఎర్రబెల్లి ని పొగడ్తలతో ముంచెత్తిన కేటీఆర్
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలకుర్తి నియోజకవర్గ ప్రగతి నివేదన సభకు ముఖ్య అతిథిగా హాజరైన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంత్రి ఎర్రబెల్లిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇలా వచ్చి అలా పోయే వాళ్లకు ఓటు వేయ్యోద్దని, అపతి సంపతీ లో అదుకునే దయాకర్ రావు నే గెలిపించమని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే దయాకర్ రావు విజయం ఖాయమైందన్నారు. సీఎం కెసిఆర్ ఆశీస్సులతో రాష్ట్ర మంత్రిగా అధ్బుతంగా పని చేసిండు అని కితాబిచ్చారు.