Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

మహిళల ఓట్లు దండుకునే కుట్ర: భారత జాతీయ మహిళా సమాఖ్య విమర్శ

పార్లమెంట్ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనున్న సందర్భంలో చట్టసభల్లో బిజెపి ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం వెనుక ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకునే కుట్ర దాగుందని నేతలు విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే 2024 పార్లమెంటు ఎన్నికల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పానగల్ మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద తక్షణం రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు వంక గోపాల్, పానగల్ మండల భారత జాతీయ మహిళా సమాఖ్య నాయకులు కృష్ణవేణి, చెన్నమ్మ, సుజాత, శివ లీల, కురుమమ్మ, వెంకటమ్మ తదితరులు మాట్లాడారు. సుమారు పదేళ్లు సంపూర్ణ మెజార్టీ తో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముంగిట చట్టం తెచ్చిందని, నిజంగా మహిళలపై ప్రేమ ఉంటే 2014లో అధికారంలో రాగానే చట్టం తెచ్చి ఉండేదని 2018 పార్లమెంట్ ఎన్నికల్లో గానే అమలు చేసే వారన్నారు. పోనీ ఇప్పుడు తెచ్చిన చట్టాన్ని2024 ఎన్నికల్లో అమలు చేసేదని, రిజర్వేషన్ 2029 పార్లమెంట్ ఎన్నికల్లో అమలవుతుందని చెప్పటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మహిళల పై ఓట్ల ప్రేమ తప్ప పార్లమెంట్ అసెంబ్లీలో 33% సీట్లు ఇవ్వాలన్న ఉద్దేశం ప్రధాని మోడీకి లేదన్నారు. ఈ చట్టంలోఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు సీట్ల రిజర్వేషన్ లేదని, ధనవంతులు, రాజకీయ పలుకుబడి ఉన్న ఉన్నత వర్గాల మహిళలకే 33% రిజర్వేషన్ సీట్లు దక్కుతాయని విమర్శించారు. అందువల్ల ఓబిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకోసం మహిళలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాయకులు చెన్నమ్మ, మంగలి అలివేల, కాకంవెంకటమ్మ, కురుమమ్మ, శంకరమ్మ, లక్ష్మి, శివ లీల, సుజాత, కౌసల్య, బొక్కలమ్మ, బాల మశమ్మ, నరసమ్మ, తెల్ల రాళ్లపల్లి ఉపసర్పంచ్ బాలస్వామి, వార్డు సభ్యులు పెంటయ్య, శివ లీల, సిపిఐ నాయకులు కురువనుమంతు, మాల కురవయ్య, చల్మారెడ్డి, మల్లెపు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!