
పొరపాటున కాంగ్రెస్ వాళ్లకు అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమం మొత్తాన్ని ఖతం చేస్తరని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కర్ణాటకలో 4 నెలల్లోనే అది రుజువు అయ్యిందని అన్నారు.
మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కు స్ధానికులు ఘన స్వాగతం పలికారు. మెయిన్ రోడ్డు సమీపంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు…
కాంగ్రెసోళ్లు పింఛన్లను రూ.75 నుంచి ప్రారంభించి గుంజి గుంజి రూ.200 వరకు లాక్కు వచ్చారని… తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను రూ.2016, రూ.3016 చేశామన్నారు. ఇప్పుడు రూ.5016, రూ.6016 చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లకు పొరపాటున చిన్న అవకాశం దొరికినా పింఛన్లను మళ్లీ రూ.200కు దిగజారుస్తారని అన్నారు. అందుకే వీరిపట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క బోయపల్లిలో పింఛన్ల కోసమే రూ.16.35 కోట్ల డబ్బులు అందించామంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఊరి అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు అందులో సగం కూడా ఖర్చు చేయలేదని అన్నారు. మేం పేదలకు అండగా ఉండటం ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ కుట్రతో రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు వంటి పథకాలను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని అన్నారు. అందుకే ఓట్ల కోసం వచ్చినప్పుడు వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కౌన్సిలర్లు మోతీలాల్, జాజిమొగ్గ నర్సింహులు, మాజీ కౌన్సిలర్ శరత్ చంద్ర, నాగిరెడ్డి తదితులున్నారు