
చిన్నంబావి మండలం గూడెం గ్రామంలో మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు పర్యటించారు. మీ కోసం – మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని లేని పక్షంలో BRS పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని ప్రజలకు పిలుపునిచ్చారు.
గతంలో నేను ఉన్నప్పుడు కొల్లాపూర్ నుంచి మీ గ్రామానికి రోడ్ వేయించానని,కొల్లాపూర్ లో బస్ డిపో ఏర్పాటు చేసి గూడెం గ్రామానికి బస్ రవాణా సదుపాయం కూడా కల్పించానని,ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాత్రం ఉన్న బస్ ను లేకుండా చేసి గూడెం గ్రామానికి రవాణా సదుపాయం లేకుండా చేశారని,కాలువల ద్వారా గూడెం గ్రామానికి సాగునీరు అందించానని ఎమ్మెల్యే కు ముందు చూపు లేకపోవడం వల్ల చిన్నంబావి రైతులకు సాగునీరు అందించడంలో విఫలం అయ్యాడని విమర్శించారు.
ప్రజా సమస్యలను గాలికి వదిలేసి భూ కబ్జాలతో సంపాదించిన అక్రమ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికల్లో అక్రమ దారిలో గెలవాలని చూస్తున్నారు అని అలాంటి వారికి ఓటు తోనే తగిన బుద్ది చెప్పాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు,మండల,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మండల,గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.