ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలో కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మైనార్టీ నాయకులు,మహిళలు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మరియు స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో చేరారు.ఈ సందర్భంగా పార్టీలో జాయిన్ అయిన వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీలో చేరామని అన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…
ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని,బీ అర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పని చేయాలని పార్టీలో చేరిన మైనార్టీ నాయకులకు సూచించారు.కేసీఆర్ సంక్షేమ పథకాలే రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు