
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినిష్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో… హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అధికార పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ టైర్ సాబ్, ఎండీ తైసిల్, ఎండీ బషీర్, ఎండీ ముస్తఫా, ఎన్ రాంరెడ్డి, కె. భానుప్రకాష్, కర్రె రాంచంద్రయ్య, కర్రె బాబు మరియు బీఎస్పీకి చెందిన తిరుమలయ్య, శ్రీనయ్య, చెన్నయ్య, ఎర్రోళ్ల కృష్ణయ్య సహా సుమారు 150 మంది మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన మార్పునకు ఆకర్షితులమై తాము పార్టీ మారుతున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, మాజీ సర్పంచులు చెన్నయ్య, హరిచందర్, కృష్ణయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు