
ఉప్పల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మందుమల్ల పరమేశ్వర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో గెలుపును సాధించేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆదివారం కాప్రా సర్కిల్ పరిధిలోని కొన్ని కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో మందుమల్ల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి కార్యకర్తలు, నాయకులు దొహాదపడాలని అన్నారు.
ఆయన తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ. 500 లకే వంటగ్యాస్ అందుతుందని, బీఆర్ఎస్ చెబుతున్న మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, హాస్తం వైపే చూస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
మందుమల్ల పరమేశ్వర్ రెడ్డి ప్రసంగంపై కాలనీల్లోని ప్రజలు స్పందిస్తూ, “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాం. మందుమల్ల పరమేశ్వర్ రెడ్డి గెలుపొందేలా మేము కృషి చేస్తాం” అన్నారు.