పల్లెకు పోదాం, బస్తీలో ఉందాం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఉప్పల్ బిజెపి మాజీ శాసనసభ్యుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ చర్లపల్లి డివిజన్లోని పలు బస్తీలలో పర్యటించి యువకులను మహిళలను వ్యాపారవేత్తలతో పాటు అనేకమంది పౌరులను కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్యక్రమాలను వివరించి వారి యొక్క అనుభవాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నమోవ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్వీప్ చేస్తుందని కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకి కి డిపాజిట్లు గల్లంతవుతుంది అని ప్రభాకర్ పేర్కొన్నారు. కేటీఆర్ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి పురపాలక శాఖ ఐటీ శాఖ ఉన్నతాధికారులపై అనేక అవినీతి అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభాకర్ ప్రశ్నించారు . రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టడం కొరకు పర్యటిస్తున్నట్టుగా ఉన్నట్టుందని ప్రభాకర్ ఆరోపించారు.