
జరగబోయే ఎన్నికలు బీసీల రాజ్యాధికార కల నెరవేరుస్తామన్న బిజెపికి, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మధ్య జరుగుతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన బీసీ పద్మశాలీలు తమ సంఘటితశక్తిని చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. పద్మశాలీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు తగిన గుణపాఠం చెప్పాలి. పద్మశాలీలను, నేత కార్మికులను వృత్తిపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, దశాబ్ద కాలాలు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు న్యాయం చేయలేకపోయాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి, కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి, పద్మశాలి సామాజిక వర్గాన్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో పద్మశాలీలు సంఘటితశక్తిగా మారి బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బిజెపి పార్టీకి మద్దతు ఇవ్వాలని నేడు పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కోరడం జరిగింది.