భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో సోమవారం అఖిల భారత వంశరాజు అన్నదాన సత్రం నిర్మాణ కమిటీ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్. మల్లేష్ వంశరాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామల శంకర్ వంశరాజు, రాజు వంశరాజు, రాజేష్ వంశరాజు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా మల్లేష్ వంశరాజు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే ఈటల రాజేందర్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై బిజెపిలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు విక్రంరెడ్డి, ఆల్ ఇండియా వంశరాజు సంఘం అధ్యక్షులు పల్లె సత్యం వంశరాజ్, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలరెడ్డి, జిల్లా కన్వీనర్ అమర్ మోహన్ రెడ్డి, అక్కల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గత రెండు దశాబ్దాలుగా బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న మల్లేష్ వంశరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరడం పట్ల సర్వత్రమవుతుంది. తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన వంశరాజ్ మల్లేష్ తర్వాత కాలంలో టిఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర నిరుపేదల సంఘం అధ్యక్షులుగా, రాష్ట్ర వంశరాజు సంఘం అధ్యక్షులుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన వంశరాజు మల్లేష్ బిజెపిలో చేరడంతో ఆ పార్టీకి బలం చేకూరినట్లు అయింది.